మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమస్కంధ మూర్తి సమేత శ్రీ జ్ఞానప్రసూనాంబ దేవి కైలాస గిరి ప్రదక్షిణ చేపట్టారు. అభయహస్తాలతో అనంత భక్తకోటిని ఆదుకునే సోమస్కందమూర్తి విల్లంభులను ధరించి తన దేవేరితో కలిసి భక్తకోటికి దర్శనమిచ్చారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రుషిరాత్రిని పురస్కరించుకుని సోమవారం అశ్వవాహనంపై సోమస్కందుడు, సింహవాహనంపై జ్ఞానాంబికలు కొలువుదీరారు. చతుర్మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య దేవదేవుని ఊరేగింపు ఆద్యంతం రమణీయంగా సాగింది. నిర్దేశిత సమయం కంటే కొంత ముందుగా స్వామివారి గిరిప్రదక్షిణ పూర్తికావడం, పక్కా ప్రణాళికతో ఉత్సవం జరపడంతో పెద్ద సంఖ్యలో భక్తులు.. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
శ్రీకాళహస్తీలో సోమస్కంధ మూర్తి సమేత శ్రీ జ్ఞానప్రసూనాంబ దేవి కైలాస గిరి ప్రదక్షిణ - giri pradakshina at srikalahasti updates
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమస్కంధ మూర్తి సమేత శ్రీ జ్ఞానప్రసూనాంబ దేవి కైలాస గిరి ప్రదక్షిణ చేపట్టారు. చతుర్మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఉరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీలో సోమస్కంధ మూర్తి సమేత శ్రీ జ్ఞానప్రసూనాంబ దేవి కైలాస గిరి ప్రదక్షిణ