Geo fencing for TTD assets: దేశవ్యాప్తంగా ఉన్న తితిదే ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించడంలో భాగంగా జియో ఫెన్సింగ్ చేయాలని తితిదే నిర్ణయించింది. జేఈవో సదా భార్గవి ఆధ్వర్యంలో బుధవారం తిరుపతి శ్రీపద్మావతి అతిథిగృహంలో జియో ఫెన్సింగ్‌పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ కార్యక్రమం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన నీర్ ఇంటరాక్టివ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ అధినేత జయశంకర్ తితిదే ఆస్తులకు ప్రయోగాత్మకంగా చేపట్టిన జియో సర్వేకి సంబంధించిన పీపీటీసీ ప్రదర్శించారు.
ప్రాధాన్య క్రమంలో తితిదే ఆస్తులను విభజించి జియో సర్వే, మ్యాపింగ్, ఫెన్సింగ్ చేపట్టాలని తితిదే ఎస్టేట్ విభాగం అధికారులను జేఈవో ఆదేశించారు. టాస్క్‌పోర్స్ బృందం ఆధ్వర్యంలో ఆస్తుల నిరంతరం ప్రత్యక్ష పర్యవేక్షణ జరగాలన్నారు. తితిదే ఆస్తుల సరిహద్దుల వెంబడి మొక్కలు పెంచాలని కోరారు. కార్యక్రమంలో తితిదే ఎఫ్‌ఏసీ ఏవో బాలాజీ, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, సీఏవో శేష శైలేంద్ర, ట్రాన్స్‌పోర్టు జీఎం శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.