వరలక్ష్మీ వ్రతం సందర్భంగా చిత్తూరు జిల్లాలోని వి.కోట మండలంలోని భరత్ నగర్లో నివసిస్తున్న మంజుల అనే మహిళ బంధువులను ఆహ్వానించింది. వారందరికి వంట చేస్తుండగా...హఠాత్తుగా సిలిండర్లో నుంచి మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకున్న మంజులను కాపాడేందుకు మరో ఇద్దరు ప్రయత్నించగా వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు మంటలను అదుపు చేసి గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి కుప్పంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
సిలిండర్ పేలి...ముగ్గురికి తీవ్ర గాయాలు
వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడటంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయాలతో ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు