ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

144 కిలోల గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్టు - police seized ganja in chittoor dst

విశాఖ జిల్లా చింతలపల్లి నుంచి కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు తరలిస్తున్న 144 కిలోల గంజాయి ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లె శివారు ప్రాంతం బోయకొండ క్రాస్ వద్ద ఎస్​ఈబీ అధికారులు పట్టుకున్నారు.

ganja seized in chittoor dst madanpalli
ganja seized in chittoor dst madanpalli

By

Published : Aug 12, 2020, 4:20 PM IST

విశాఖ జిల్లా నుంచి కర్ణాటకకు తరలిస్తున్న గంజాయిని చిత్తూరు జిల్లాలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లికి చెందిన ముగ్గురు మహిళలు ఒక యువకుడితో పాటు ఓమ్ని వ్యాన్ డ్రైవర్ ను కూడా ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరు విశాఖ జిల్లా చింతలపల్లి నుంచి గంజాయిని ఒక్కో ప్యాకెట్లో రెండు కిలోల చొప్పున ప్యాక్ చేసి వాహనంలో తరలిస్తున్నట్టు గుర్తించారు.

గంజాయి తరలింపు సమాచారం తెలుసుకున్న ఎస్​ఈబీ అధికారులు కాపు కాశారు. పట్టణ శివారు ప్రాంతం బోయకొండ క్రాస్ వద్ద వీరిని వాహనంతో సహా పట్టుకుని మదనపల్లె ఎక్సైజ్ పోలీస్ స్టేషన్​కు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 10 లక్షల రూపాయలు ఉండవచ్చని అంచనా వేశారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు సీఐ ఫణీంద్ర వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details