అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను చిత్తూరు జిల్లా తిరుచానూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు కేజీల గంజాయి, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీను, ప్రవీణ్ కుమార్, మహమ్మద్ అసిఫ్ అనే ముగ్గురు నిందితులను తిరుపతి గ్రామీణ మండలం తనపల్లి ఇందిరమ్మ గృహాల వద్ద అరెస్టు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్టు - గంజాయి ముఠా అరెస్టు
చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలం తనపల్లి ఇందిరమ్మ గృహాల సమీపంలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3 కేజీల గంజాయి, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
![గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్టు గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9319307-758-9319307-1603716746249.jpg)
గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్టు