చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఏడు గంగమ్మల జాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు. కరోనా నిబంధనల పాటిస్తూ జాతరను జరిపించారు. 200 సంవత్సరాల నాటి సంప్రదాయాలను పాటిస్తూ..పసుపు ముద్దతో అమ్మవారిని ఊరేగిస్తూ ఏడు చోట్ల ప్రతిష్టించారు. సాయంత్రం ఈ పసుపు ముద్దలతో చేసిన అమ్మవారి ప్రతిమలను నిమజ్జనం చేశారు.
శ్రీకాళహస్తిలో ఘనంగా ఏడు గంగమ్మల జాతర - edu gangala jatara news update
ఏడు గంగమ్మల జాతరను శ్రీకాళహస్తిలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పసుపు ముద్దలతో చేసిన ఏడు అమ్మవారి ప్రతిమలను అందంగా అలంకరించి ఊరేగించారు. అనంతరం సాయంత్రం అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని జరిపించారు. జాతర సందర్భంగా భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.
శ్రీకాళహస్తిలో ఘనంగా ఏడు గంగల జాతర
భక్తుల దర్శనార్థం ఉత్సవమూర్తులను పూలతో అలంకరించారు. పొన్నాలమ్మ, అంకమ్మ, భువనేశ్వరి, కావమ్మ, ముత్యాలమ్మ, అంకాలమ్మ, నల్ల గంగమ్మ పేర్లతో ఏడు వీధుల్లో అమ్మవారు కొలువుదీరారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఇవీ చూడండి...శ్రీనివాసం, మాధవం వసతి గృహాల్లో శ్రీవారి భక్తులకు గదులు
Last Updated : Dec 9, 2020, 1:58 PM IST