తిరుమల వేంకటేశ్వరస్వామి ఆడపడుచుగా భక్తులు భావించే.. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ జాతర ఎంతో వైభవంగా సాగుతోంది. జాతరలో మూడోరోజు భక్తులు బండవేషం ధరించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శరీరమంతా కుంకుమ రాసుకుని, కాటుకబొట్లు, తెల్లటి పూలు చుట్టుకుని చిన్నా, పెద్దా అందరూ వేషాలు వేసుకుని కర్రలు చేతబట్టి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పాలేగాడిని కనిపెట్టటానికి గంగమ్మ రోజుకొక వేషంలో సంచరించినట్టు.. భక్తులు కూడా వివిధ వేషాలు ధరించారు. తిట్లు తిడుతూ తిరుగుతూ ఉంటే.. అమ్మవారు సంతోషించి కోర్కెలు తీరుస్తుందనేది ఇక్కడి భక్తుల నమ్మకం. తలమీద సున్నపు కుండలు పెట్టుకుని ఆలయంలో ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మూడోరోజుకు... తాతయ్యగుంట గంగమ్మ జాతర
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఎంతో వైభవంగా జరుగుతోంది. భక్తుల విచిత్ర వేషధారణలు ఆకట్టుకుంటున్నాయి.
గంగమ్మ జాతర