చిత్తూరు జిల్లాలోని తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా కొనసాగుతోంది. 7వ రోజు జాతరలో భాగంగా వివిధ రకాల వేషాలతో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పొంగళ్లు, అంబలి తయారు చేసి అమ్మవారికి సమర్పించుకున్నారు. ఇద్దరు కైకాల కులస్థులు సున్నపు కుండల వేషాన్ని ధరించారు. నగరంలోని ప్రతి ఇంటికి వెళ్ళి హారతులందుకున్నారు. వీరిని పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మలకు ప్రతీకలుగా భక్తులు భావిస్తారు. మంగళవారం తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు.
ఏడో రోజూ వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర - చిత్తూరు జిల్లాలోని తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర
చిత్తూరు జిల్లాలోని తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా కొనసాగుతోంది. భక్తులు పొంగళ్లు, అంబలి అమ్మవారికి సమర్పించుకున్నారు. పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మలకు ప్రతీకలుగా ఇద్దరు కైకాల కులస్థులు సున్నపు కుండల వేషాన్ని ధరించారు.
ఏడో రోజూ వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర
TAGGED:
కైకాల కులస్థులు