ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు - gandhi jayanthi

చిత్తూరు జిల్లాలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే రోజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గాంధీజీ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. పీలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

gandhi jayanthi celebrations at chittor district
చిత్తూరు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

By

Published : Oct 2, 2020, 5:40 PM IST

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కేఎస్ అఘమొహిద్దిన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నవభారత నిర్మాణానికి మహాత్మా గాంధీ ఆదర్శప్రాయులని కొనియాడారు.

జిల్లాలోని పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో... గాంధీ జయంతిని పురస్కరించుకుని కాఫీ పొడి వ్యర్థాలతో 50 అడుగుల పొడవు 30 అడుగుల వెడల్పుతో గాంధీ చిత్రాన్ని వేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోజా ముఖ్య అతిథిగా హాజరై గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. మహాత్ముడి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని... ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. రాష్ట్రంలో గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్నారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details