ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మట్టి గాజుల గణపయ్యకు ముస్లింల ప్రసాదం... - చిత్తూరు జిల్లా

తుమ్మలగుంటలో 2 లక్షల మట్టిగాజులతో తయారైన బొజ్జ గణపయ్య విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ,తిరుపతి ఎమ్మెల్యే కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముస్లింలు తయారుచేసిన లడ్డూను ప్రసాదంగా సమర్పించారు.

ganapati made by 2 lacks of bangles started the govt. whip in thummalagunta at chittore district

By

Published : Sep 2, 2019, 1:46 PM IST

కులమతాలకు అతీతంగా గణనాథుడు విశిష్టపూజలు అందుకుంటున్నాడు. చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని తుమ్మలగుంటలో 2లక్షల మట్టి గాజులతో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమను ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ముస్లింలు తయారు చేసిన లడ్డూను మొదటి ప్రసాదంగా స్వామి వారికి సమర్పించారు. బాల వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఏటా పర్యావరణహితంగా ఉండాలనే సందేశం ఇచ్చేలా ప్రత్యేక గణపతి మూర్తులను ఏర్పాటు చేస్తున్నట్లు చెవిరెడ్డి తెలిపారు.

మట్టిగాజుల బొజ్జ గణపయ్యకు ముస్లింసోదరుల లడ్డు.

ABOUT THE AUTHOR

...view details