ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో అమానవీయం.. ఖననాన్ని అడ్డుకున్న గ్రామస్థులు - చిత్తూరు జిల్లాలో ఖననం అడ్డగింత

కరోనా భయం మానవత్వాన్ని మంటగలుపుతోందనడానికి చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ ఘటన ఉదాహరణగా మారింది. కరోనాతో చనిపోయి ఉంటాడనే అనుమానంతో ఖననాన్ని అడ్డుకున్నారు ఐదు గ్రామాల ప్రజలు. కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించి నెగెటివ్ తెలితేనే గ్రామంలో ఖననం చేయాలని తేల్చిచెప్పారు.

funeral was interrupted by people from five villages with corona fear in chittor district
funeral was interrupted by people from five villages with corona fear in chittor district

By

Published : Jul 12, 2020, 4:12 PM IST

Updated : Jul 12, 2020, 7:30 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం వలసపల్లెలో అమానవీయ ఘటన జరిగింది. కరోనాతో మరణించాడన్న అనుమానంతో మృతదేహాన్ని ఖననం చేయకుండా అడ్డుకున్నారు ఐదు గ్రామాల ప్రజలు.

మదనపల్లె పట్టణంలోని ఈశ్వరమ్మ కాలనీ వాసి(43) ఇటీవల అస్వస్థతకు గురయ్యాడు. వారం రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. అతను ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటంతో... వైద్యులు తిరుపతికి రిఫర్ చేశారు. అనంతరం కుటుంబ సభ్యులు అతన్ని తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతదేహాన్ని మండలంలోని వలసపల్లెలో ఖననం చేసేందుకు మృతుని బంధువులు ప్రయత్నించారు. అయితే అతను కరోనాతో చనిపోయి ఉంటాడనే అనుమానంతో ఖననం చేయడాన్ని పరిసర గ్రామస్థులు అడ్డుకున్నారు.

కొవిడ్ పరీక్షలు నిర్వహించి నెగెటివ్ తేలితేనే ఇక్కడ ఖననం చేయాలని తేల్చిచెప్పారు. చేసేదేమీ లేక పోలీసులు, వైద్య సిబ్బందికి ఆదివారం ఉదయం సమాచారమిచ్చారు మృతుని బంధువులు. మృతదేహానికి సాయంత్రం మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు కొవిడ్ పరీక్షలు చేశారు. అనంతరం మదనపల్లె శివారు అటవీ ప్రాంతంలో గొయ్యి తవ్వి ఖననం చేశారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1933 కరోనా కేసులు...19 మరణాలు

Last Updated : Jul 12, 2020, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details