ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Rayalacheruvu lake: ఆ చెరువు ఎప్పుడైనా తెగొచ్చు జాగ్రత్తా.. అధికారుల దండోరా - rayalacheruvu, tirupathi

చిత్తూరు జిల్లాలోనే అతిపెద్ద చెరువుల్లో ఒకటైన రామచంద్రపురం మండలంలోని రాయల చెరువు(rayalacheruvu full water) పూర్తిగా నిండిపోయింది. దీంతో.. పరిసర ప్రాంత ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేస్తూ.. దండోరా వేయించారు.

full water in rayalacheruvu lake at tirupathi
నిండుకుండలా రాయల చెరువు

By

Published : Nov 20, 2021, 8:06 PM IST

స్థానికులను జాగ్రత్తగా ఉండాలంటూ దండోరా

చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలంలోని రాయల చెరువు నిండు(Rayalacheruvu) తెగిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చెరువు దిగువ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ మేరకు దండోరా వేయించారు. మొరవ నుంచి నీరు వెలుపలికి పంపేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.

రాయలచెరువు వద్దకు వచ్చిన ఆర్డీవో రేణుక అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాయల చెరువు నీటి సామర్థ్యం తగ్గించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చెరువు తెగితే 40 గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచి ఉంది.

చిత్తూరు జిల్లాలో అతి పెద్ద చెరువుల్లో రాయలచెరువు కూడా ఒకటి. దీని కింద వేలాది ఎకరాల ఆయకట్టు ఉంది. భారీ వర్షాలతో వరద నీటి ప్రవాహం రాయలచెరువుకు పెరగడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కట్ట బలహీనంగా ఉండటంతో ఏ క్షణమైనా తెగిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్న అధికారులు.. చెరువు కింది భాగంలో ఉన్న వందలాది గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోవాలంటూ దండోరా వేయించారు.

ఇదీ చదవండి:

TIRUPATI RAINS: జలదిగ్బంధంలో తిరుపతి.. వరద ముంపులో కాలనీలు

ABOUT THE AUTHOR

...view details