శనివారం రాత్రి పడిన వర్షంతోపాటు.. కర్ణాటక ప్రాంతం నుంచి భారీగా వర్షపు నీరు రావడం వల్ల చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలంలోని కైగల్ జలపాతం ఉప్పొంగుతోంది. భారీగా నీళ్లు ప్రవహిస్తూ... కొండ వాలు నుంచి అటు ఇటు నీళ్లు పడుతున్నాయి. మధ్యలో శివలింగం ఉన్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఈ దృశ్యాలను చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి యువత జలపాతం వద్దకు వస్తున్నారు.
కనువిందు చేస్తున్న కైగల్ జలపాతం
గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలమనేరు నియోజవర్గంలోని అన్ని మండలాల్లో చిన్న చిన్న చెరువులు.. వాగులు, వంకలు జలకళ సంతరించుకున్నాయి. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలంలోని కైగల్ జలపాతం ఉప్పొంగుతోంది.
కనువిందు చేస్తున్న కైగల్ జలపాతం