చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో స్వయం ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా రాయితీ రుణాలను ఇప్పిస్తామంటూ... జనాన్ని మోసగించిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు... కుప్పం ప్రాంతంలో కొందరిని నమ్మించి రుణాలు ఇప్పిస్తామంటూ.. డబ్బులు వసూలు చేశారు.
కుప్పం, రామ కుప్పం మండలాల్లో సుమారు 15 మంది అధికార పార్టీ నేతలు రూ. 20 లక్షల వరకు వారి బ్యాంక్ ఖాతాలోకి జమచేశారు. చివరకు మోసపోయామని గుర్తించి... పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు...ముగ్గురు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.