చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు సమీపంలో శిల్పారామం వద్దనున్న పెట్రోల్ బంకు వద్ద వినియోగదారులు స్థానికులతో కలసి ఆందోళన చేపట్టారు. ఓ వ్యక్తి ఆయిల్ పట్టించుకుంటుండగా మోసం చేస్తున్నారని గ్రహించి..అతను సిబ్బందిని నిలదీశారు. సిబ్బంది బుకాయించే ప్రయత్నం చేశారు. పెట్రోల్ పట్టకుండా పట్టినట్లు నటిస్తూ మోసం చేస్తున్నారని వినియోగదారులు బంకు వద్ద ఆందోళన చేపట్టారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యం చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఇలా అవినీతికి పాల్పడే దుకాణాలను గుర్తించి లైసెన్సులు రద్దు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.
తిరుచానూరు పెట్రోల్ బంకులో మోసం..స్థానికుల ఆందోళన - తిరుచానూరు పెట్రోల్ బంకు వార్తలు
పెట్రోల్ బంకుల నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో వినియోగదారులను మోసం చేస్తున్నారు. కొలతల్లో కోతపెడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. చిత్తూరు జిల్లా తిరుచానూరు సమీపంలోని శిల్పారామం వద్దనున్న పెట్రోల్ బంకులో అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళనకు దిగారు.

తిరుచానూరు పెట్రోల్ బంకులో మోసం