KANIPAKAM TEMPLE : చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు నాలుగోరోజు ఘనంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. వెయ్యి నూట 16 మంది దంపతులు తలపై కలశాలు ధరించి పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్వామివారికి అర్చకులు.. తేనె, నెయ్యి, పాలు, పెరుగు సుగంధ ద్రవ్యాలతో.. ప్రత్యేక అభిషేకాలు చేశారు. షోడశోర పూజలు అనంతరం చిన్నశేష వాహనంపై కాణిపాక మాడవీధుల్లో.. సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామిని ఊరేగించారు.
వైభవంగా కాణిపాకం బ్రహ్మోత్సవాలు.. కలశాలతో పాల్గొన్న 1,116 మంది దంపతులు - 2022 కాణిపాకం బ్రహ్మోత్సవాలు
KANIPAKAM BRAHMOTSAVALU: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సుమారు 1,116 మంది దంపతులు తలపై కలశాలు ధరించి పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
KANIPAKAM BRAHMOTSAVALU