కోడి పందెం బెడిసికొట్టడంతో నలుగురు యువకులు కత్తిపోట్లకు గురైన సంఘటన చిత్తూరు జిల్లా కలికిరి మండలంలో జరిగింది. మండలంలోని రంగనాథపురానికి చెందిన విడగొట్టి వెంకటరమణ(45) ఆదివారం తమ గ్రామ సమీపాన ఉన్న అటవీ ప్రాంతం ఓలేచెరువు వద్ద జరిగే కోడిపందేలకు ఇదే గ్రామానికి చెందిన అజయ్, దేవేంద్రలతో కలిసి వెళ్లాడు.
బెడిసికొట్టిన కోడిపందెం... నలుగురికి కోడి'కత్తి' పోట్లు - chittoor district updates
చిత్తూరు జిల్లా కలికిరి మండలంలో కోడి పందెం బెడిసికొట్టి.. నలుగురు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వివాదం
ఈ పందెంలో కలకడ మండలం కొత్తగండ్లాపల్లికి చెందిన రవితేజతో వెంకటరమణ పందెం కాశాడు. ఈ పందెంలో రవితేజ కోడి పుంజు ఓడిపోవడంతో పందెం ప్రకారం ఆ కోడిని ఇవ్వాలని అడిగాడు. ఈ క్రమంలో ఇరువరి మధ్య మాటామాటా పెరిగి ఇరు వర్గాల వారు ఘర్షణకు దిగారు. కోడి కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇరువర్గాలకు చెందిన వెంకటరమణ ,అజయ్, దేవేంద్ర, రవితేజలు కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చేరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి