- చిత్తూరు జిల్లాలో...
వరదయ్యపాలెం మండలం లక్ష్మీపురం గ్రామంలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. గ్రామానికి చెందిన ఐదుగురు... వర్షం కురుస్తున్న సమయంలో ఓ చెట్టు కిందకు చేరుకోగా.. ఒక్క సారిగా చెట్టుపై పిడుగు పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
- ప్రకాశం జిల్లాలో...
కొమ్మినేనివారిపాలెం సమీపంలో పిడుగు పడి వీరయ్య అనే గొర్రెల కాపరి మృతిచెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలవటంతో 108 వాహనంలో మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
- నెల్లూరు జిల్లాలో...
వింజమూరు మండలం జనార్ధన్పురంలో పిడుగుపాటుకు పుల్లయ్య అనే వృద్ధుడు మృతి చెందాడు. రేకుల వరండా కింద కూర్చుని ఉండగా... పెద్ద శబ్దంతో పిడుగు పడింది.
- కడప జిల్లాలో...