ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా వేళ దిల్లీకి చిత్తూరు పాలు... కొరత రాకుండా దక్షిణమధ్య రైల్వే సరఫరా - చిత్తూరు నుంచి దిల్లీకి పాలు సరఫరా చేసిన దక్షిణమధ్య రైల్వే

కరోనా ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే నిత్యావసర సరకుల కొరత ఏర్పడకుండా.. దక్షిణమధ్య రైల్వే చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. దేశ రాజధాని ధిల్లీతో పాటు ఉత్తరాధి రాష్ట్రాల్లో పాల కొరత నివారించడం కోసం.. చిత్తూరు జిల్లా నుంచి 4 కోట్ల లీటర్ల పాలను దక్షిణ మధ్య రైల్వే రవాణా చేసింది. దూద్‌దురంతో ఎక్స్‌ప్రెస్‌ పేరుతో రేణిగుంట నుంచి ప్రత్యేక రైళ్ల ద్వారా 4 కోట్ల లీటర్ల పాలను దిల్లీకి తరలించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

milk supply from chittore to delhi
దక్షిణమధ్య రైల్వే ఘనత.. చిత్తూరు నుంచి దిల్లీకి 4 కోట్ల లీటర్ల పాలు సరఫరా

By

Published : Nov 14, 2020, 10:55 AM IST

కరోనా ప్రభావంతో ప్రకటించిన లాక్‌డౌన్‌ సమయంలో ఉత్తరాధి రాష్ట్రాల్లో పాల కొరత నివారించడం.. స్థానిక పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంతో దక్షిణమధ్య రైల్వే అమలు చేసిన కార్యక్రమం అరుదైన ఘనత సాధించింది. దూద్‌దురంతో ఎక్స్‌ప్రెస్‌ పేరుతో చిత్తూరు జిల్లా రేణిగుంట నుంచి దేశరాజధాని దిల్లీలోని హజ్రత్‌ నిజాముద్దీన్‌ స్టేషన్‌కు చేపట్టిన పాల రవాణాతో 4 కోట్ల లీటర్ల పాలు ఎగుమతి అయ్యాయి.

దూద్​దురంతో పేరుతో ప్రత్యేక రైళ్లు

లాక్‌డౌన్‌కు ముందు రేణిగుంట నుంచి న్యూదిల్లీకి నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ట్యాంకర్లను అమర్చడం ద్వారా పాల రవాణా జరిగేది. కరోనా ప్రభావంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు రద్దు కావటంతో దేశ రాజధానికి పాల రవాణా ఆగిపోయింది. పాల కొరత ఏర్పడకుండా దూద్‌ దురంతో ఎక్స్‌‌ప్రెస్‌ పేరుతో దక్షిణ మధ్య రైల్వే దిల్లీకి ప్రత్యేక రైళ్లు నడిపింది. పాల రవాణా కోసం ఏర్పాటు చేసిన ఈ రైళ్లను 34 గంటల వ్యవధిలో హజ్రత్‌ నిజాముద్దీన్‌ స్టేషన్ చేరుకునేలా నడుపుతున్నారు.

3 వేల పాల సేకరణ కేంద్రాలు

ప్రత్యేక రైళ్ళ ద్వారా ధిల్లీకి సరఫరా చేస్తున్న పాలను చిత్తూరు జిల్లాతో పాటు పొరుగున ఉన్న అనంతపురం, కడప జిల్లాలలోని గ్రామాల నుంచి సేకరిస్తున్నారు. నేషనల్‌ డైరీ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎన్​డీడీబీ) ఏర్పాటు చేసిన 3 వేల పాల సేకరణ కేంద్రాల ద్వారా రైతుల నుంచి పాలు సేకరిస్తున్నారు. లాక్‌డౌన్‌ ప్రారంభమయ్యాక ఈ ఏడాది మార్చి 26న తొలి దూద్‌దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైలును నిర్వహించిన దక్షిణమధ్య రైల్వే... జులై 15 వరకు రోజు మార్చి రోజు ఒక రైలు నడిపింది..

ఉత్తరాధి రాష్ట్రాల్లో పాలకు డిమాండ్‌ పెరగటంతో జులై 15 నుంచి ప్రతి రోజు దూద్‌దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైలు నడుస్తోంది. ఒక్కో టాంకర్‌లో 40 వేల లీటర్ల చొప్పున 6 ట్యాంకర్లతో ఒక్కో రైలులో 2.40 లక్షల లీటర్ల పాలను రవాణా చేస్తోంది. గడిచిన 8 నెలల కాలంలో 167 దూద్‌ దురంతో రైళ్ళ ద్వారా 4 కోట్ల లీటర్ల పాలను రవాణా చేసింది.

ఇవీ చదవండి..

బాల్యం స్వభావాన్ని కరోనా మార్చేసింది... ఆ జ్ఞాపకాలు లేకుండా చేసింది!

ABOUT THE AUTHOR

...view details