ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దేశంలో అవినీతి రాజ్యమేలుతోంది...'

కేంద్రం, రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. నిత్యం పెట్రోల్, డిజల్, గ్యాస్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం.. సామాన్యుడి నడ్డి విరుస్తోందని విమర్శించారు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఎద్దేవా చేశారు.

Former Union Minister Chintamohan
దేశంలో అవినీతి రాజ్యం ఏలుతోంది

By

Published : Mar 3, 2021, 6:29 PM IST

కేంద్రం, రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్​, రైలు, బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తూ కార్మికుల కడుపు కొడుతోందని వాపోయారు. నిత్యం పెట్రోల్, డిజల్,,గ్యాస్ ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తోందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మన్నవరం బెల్ పరిశ్రమ, శ్రీకాళహస్తి - నడికుడి రైలు మార్గం, దుగరాజ పట్నం ఓడ రేవు ప్రాజెక్టు ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. మరో వైపు రాష్ట్రంలో ఇంటింటికి రేషన్ పథకం పెట్టి పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. రానున్న ఎన్నికల్లో కేంద్రం ,రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండీ...రాష్ట్రవ్యాప్త బంద్​కు వామపక్ష పార్టీ పిలుపు

ABOUT THE AUTHOR

...view details