ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో.. పోలీస్​స్టేషన్​కు మాజీ మంత్రి

స్థానిక ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘన కేసులో పోలీసులు నోటీసులు ఇవ్వటంతో... చిత్తూరు జిల్లా వి.కోట పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు మాజీమంత్రి అమర్‌నాథ్‌రెడ్డి. పార్టీ కార్యకర్తలతో కలిసి పోలీసుల ఎదుట హాజరయ్యారు. వ్యక్తిగత పూచీకత్తుపై అమర్‌నాథ్‌రెడ్డిని పోలీసులు విడిచిపెట్టారు. స్థానిక ఎన్నికల్లో అమర్‌నాథ్‌రెడ్డి, పార్టీ కార్యకర్తలపై రెండు కేసులు నమోదయ్యాయి.

By

Published : Jun 3, 2020, 11:46 PM IST

Former minister Amarnath Reddy
మాజీమంత్రి అమర్‌నాథ్ ‌రెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో....సక్రమంగా విధులు నిర్వహించని అధికారులను ప్రశ్నించినందుకే తనపై తప్పుడు కేసులు బనాయించారని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత అమర్​నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా వి.కోట పోలీస్ స్టేషన్​లో పార్టీ కార్యకర్తలతో కలిసి హాజరైన ఆయన....తనకు జారీ చేసిన నోటీసులపై సమాధానమిచ్చారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై మాజీ మంత్రిని పోలీసులు విడిచిపెట్టారు.

తన తండ్రి హయాం నుంచి రాజకీయాల్లో ఉన్నా...ఏ రోజూ ఓ కేసులో ఏ1 నిందితుడిగా ఉండేంత తప్పులు చేయలేదన్నారు అమర్​నాథ్ రెడ్డి. స్థానిక ఎన్నికల్లో వైకాపా ఆగడాలను అడ్డుకున్నందుకు, ఎన్నికల అధికారులను ప్రశ్నించినందుకే తనతో సహా 38మంది తెదేపా కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. సంవత్సర కాలంలో వైకాపా ప్రభుత్వం సాధించిన ప్రగతి శూన్యమని అమర్ నాథ్ రెడ్డి విమర్శించారు.

ఇవీ చదవండి:ఆలయాలు తెరిచేందుకు సన్నద్ధంకండి: వెల్లంపల్లి

ABOUT THE AUTHOR

...view details