ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన అగరాల ఈశ్వర్ రెడ్డి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1967లో తిరుపతి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1982 సెప్టెంబర్ నుంచి 1983 జనవరి వరకు శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
సీఎం జగన్ సంతాపం