అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటనపై ప్రశ్నించేందుకు వెళ్లిన వారిని అరెస్టు చేశారని, వారిని విడుదల చేయాలనే డిమాండ్‌తో భాజపా ‘చలో అమలాపురం’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి వెళ్ళనివ్వకుండా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయం పాలకమండలి మాజీ ఛైర్మన్ కోలా ఆనంద్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను చూస్తూ ఊరుకునేది లేదని కోలా ఆనంద్ తెలిపారు. తమను పోలీసులు అడ్డుకున్న మాత్రాన ఉద్యమాన్ని అపబోమని హెచ్చరించారు.
శ్రీకాళహస్తీశ్వరాలయం పాలకమండలి మాజీ ఛైర్మన్ గృహ నిర్బంధం - చలో అమలాపురం కార్యక్రమం వార్తలు
'చలో అమలాపురం' కార్యక్రమానికి వెళ్ళనివ్వకుండా శ్రీకాళహస్తీశ్వరాలయం పాలకమండలి మాజీ ఛైర్మన్ కోలా ఆనంద్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
శ్రీకాళహస్తీశ్వరాలయం పాలకమండలి మాజీ ఛైర్మన్ గృహ నిర్బంధం