చిత్తూరు జిల్లా తెరపదడి ప్రాంతంలో 29 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక తమిళ స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. యర్రావారిపాళ్యం మండలంలోని తలకోన అడవులలో చేపట్టిన కూంబింగ్‌లో 30 మంది తమిళ స్మగ్లర్లు ఎర్రచందనం తెస్తూ అధికారుల కంటపడ్డారు. అధికారులను చూసి దుంగలను పడేసి స్మగ్లర్లు అడవిలోకి పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భాకరాపేట అటవీశాఖ అధికారులు చెప్పారు.
ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు - coombing in thalakona forest news
చిత్తూరు జిల్లాలోని యర్రావారిపాళ్యం మండలంలోని తలకోన అడవులలో అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఇరవై తొమ్మిది ఎర్రచందనం దుంగలతో పాటు తమిళ స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఎర్రచందనం స్వాధీనం