ఆంధ్రప్రదేశ్

andhra pradesh

32 ఎర్రచందనం దుంగలు స్వాధీనం... ఇద్దరు అరెస్ట్

By

Published : Oct 27, 2020, 4:35 PM IST

చిత్తూరు జిల్లా యార్రావారిపాళ్యం మండలంలోని తలకోన శేషాచలం అడవుల్లో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. 32 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది పారిపోగా వారి కోసం గాలిస్తున్నారు.

red sandal wood
red sandal wood

చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవుల్లో తమినాడుకు చెందిన స్మగ్లర్ల ఆగడాలు ఆగటం లేదు. అటవీ శాఖ అధికారులు నిరంతరం కూంబింగ్ చేపడుతున్నా... వారి రాకను అరికట్టలేకపోతున్నారు. యర్రావారిపాళ్యం మండలంలోని తలకోన శేషాచల అడవులలో సోమవారం రాత్రి నిర్వహించిన కూబింగ్​లో ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 32 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది స్మగ్లర్లు పారిపోగా... వారి కోసం అదనపు బలగాలతో శేషాచల అడవులను జల్లెడపడుతున్నట్లు భాకరాపేట ఎఫ్.ఆర్.ఓ పట్టాభి తెలిపారు. ఈ కూబింగ్​లో పాల్గొన్న ఎఫ్.ఎస్.ఓ నాగరాజను, ఎఫ్.బి.ఓ వందనకుమార్​ను బేస్ క్యాంపు సిబ్బందిని ఆయన అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details