ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శేషాచలం అడవుల్లో కూంబింగ్... నెమలి మాంసం స్వాధీనం - చిత్తూరు జిల్లా నేర వార్తలు

చిత్తూరు జిల్లా యర్రావారిపాళ్యం మండలంలోని శేషాచల అడవుల్లో వన్యప్రాణి వేటగాళ్లు పెట్రేగిపోతున్నారు. భాకరాపేట సమీపంలోని అడవుల్లో నెమలి మాంసం తరలిస్తున్న వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

forest officers  coombing in sheshachalam forest in chithore district
శేషాచలం అడవుల్లో కూంబింగ్ ... నెమలి మాంసం స్వాధీనం

By

Published : Mar 22, 2021, 3:33 PM IST

చిత్తూరు జిల్లా భాకరాపేట సమీపంలోని అడవుల్లో ఆదివారం రాత్రి అటవీ శాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో తలకోన చెక్​పోస్ట్ సమీపంలోని నిమ్మకాయలబండ వద్ద నెమలి మాంసాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి నెమలి మాంసం, ఉచ్చును స్వాధీనం చేసుకున్నారు.

అధికారుల రాకను గమనించిన మరో ఇద్దరు వేటగాళ్లు పారిపోయారు. విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్న వ్యక్తిని భాకరాపేట అటవీశాఖ ప్రధాన కార్యాలయానికి తరలించారు. పరారీలో ఉన్నవారి కోసం అధికారులు గాలింపు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details