కరోనా నివారణకు రాత్రింబవళ్లు కష్టపడుతున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ఇతర సంఘ సేవకులకు ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ పండ్ల రసాలను పంపిణీ చేశారు. కరోనా కట్టడిలో శ్రమిస్తున్నవారికి వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేందుకే పండ్ల రసాలు పంపిణీ చేసినట్లు ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ లలితమ్మ పేర్కొన్నారు. మొదట తంబళ్లపల్లి, పెద్దమండ్యం మండలాల్లోని పోలీస్ స్టేషన్లు, మండల పరిషత్ కార్యాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పండ్ల రసాల ప్యాకెట్లను అందజేశారు.
ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పండ్ల రసాల పంపిణీ - ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ పండ్ల రసాల పంపిణీ వార్తలు
ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి, పెద్దమండ్యం మండలాల్లో పండ్ల రసాలు పంపిణీ చేశారు. రోగనిరోధక శక్తి పెంచేందుకు పోలీస్ స్టేషన్, మంటల పరిషత్ కార్యాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్యాకెట్లను అందజేశారు.
ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ పండ్ల రసాల పంపిణీ