గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల శ్రీవారు ఒకే నెలలో 3 సార్లు గరుడ వాహనంపై విహరించనున్నారు. సాధారణంగా బ్రహ్మోత్సవాలతో పాటు ప్రతినెలా పౌర్ణమి రోజున మలయప్పస్వామికి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. అయితే పౌర్ణమి సందర్భంగా అక్టోబర్ నెల 1న, 31న... అదేవిధంగా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 20న గరుడ వాహనంపై వేంకటేశ్వర స్వామి దర్శనం ఇవ్వనున్నారు.
ఒకే నెలలో గరుడ సేవ మూడోసారి... శ్రీవారికి ఇదే మొదటిసారి! - tirumala lord balaji latest news
తిరుమలలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. మలయప్పస్వామికి ఒకే నెలలో 3 సార్లు గరుడ వాహన సేవ జరగనుంది.
![ఒకే నెలలో గరుడ సేవ మూడోసారి... శ్రీవారికి ఇదే మొదటిసారి! garuda seva](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8999145-493-8999145-1601476477769.jpg)
garuda seva
బ్రహ్మోత్సవాల వేళ గరుడవాహనంపై ఆసీనులైన మలయప్పను దర్శించుకోవటానికి ప్రపంచం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తిరుమల తరలివస్తారు. అయితే ఈ ఏడాది కోవిడ్ నిబంధనల కారణంగా శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు.