చిత్తూరు జిల్లా గుడిపల్లిలో పదిహేను మంది అస్వస్థతకు గురయ్యారు. ఓ రాజకీయ పార్టీ తరఫున ఎన్నికల నామినేషన్‌కు బాధితులు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన బిర్యానీ తిన్నాక వారు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. బాధితులకు చిత్తూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చిత్తూరు జిల్లాలో 15 మందికి అస్వస్థత..బిర్యానీనే కారణమా ? - చిత్తూరులో 15 మందికి అస్వస్థత
ఓ రాజకీయ పార్టీ తరఫున ఎన్నికల నామినేషన్‌కు వచ్చిన 15 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గుడిపల్లిలో చోటుచేసుకోగా..అభ్యర్థి ఏర్పాటు చేసిన బిర్యానీ తినటం వల్లే అస్వస్థకు గురైనట్లు సమాచారం.
![చిత్తూరు జిల్లాలో 15 మందికి అస్వస్థత..బిర్యానీనే కారణమా ? 15 మందికి అస్వస్థత..బిర్యానీనే కారణమా ?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10539242-383-10539242-1612722391452.jpg)
15 మందికి అస్వస్థత..బిర్యానీనే కారణమా ?
Last Updated : Feb 8, 2021, 12:05 AM IST