చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. నరసింగాపురం వద్ద గస్తీ తిరుగుతుండగా 9 మంది యువకులు తారసపడ్డారు. వారిని విచారించేందుకు దగ్గరకు వెళ్లగా నలుగురు పారిపోయారు. మిగిలిన ఐదుగురిని పట్టుకున్న పోలీసులు..వారి వద్దనున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి గంజాయిని తెచ్చి రెండేళ్లుగా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. పారిపోయిన వారికోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
CRIME: చంద్రగిరిలో గంజాయి అక్రమ రవాణా... ఐదుగురు యువకుల అరెస్టు - చిత్తూరు జిల్లా ప్రధాన వార్తలు
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. నరసింగాపురం వద్ద గస్తీ తిరుగుతుండగా పోలీసులకు 9 మంది యువకులు తారసపడ్డారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిని విచారించేందుకు దగ్గరకు వెళ్లగా నలుగురు పారిపోయారు.
చంద్రగిరిలో గంజాయి అక్రమ రవాణా