ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Five Steps Farming: ఐదంతస్తుల సాగుబడి.. ఏడాది పొడవునా దిగుబడి - ఐదంతస్తుల సాగుబడి

ఎటుచూసినా దుర్భిక్షం.. ఆకాశం వైపు ఎన్నిసార్లు చూసినా రాలిపడని చినుకు.. తడవని నేల.. నడవని బతుకులు.. ఎన్నాళ్లు ఇలా అనుకున్నారు ఆ అతివలు. మార్పు కోసం ఎవరో వస్తారు, ఏదో చేస్తారని చూడలేదు.. కరవు నేలపై సిరుల పంటకు శ్రీకారం చుట్టారు. సాగు రంగంలో ఐదంతస్తుల విధానానికి తెరతీశారు. ఐదంతస్తుల భవనం చూశాం కానీ.. ఐదంతస్తుల వ్యవసాయం ఏంటీ అంటారా?..ఆ వివరాలన్నీ తెలుసుకోవాలంటే చిత్తూరు జిల్లాకు వెళ్లాల్సిందే.

five steps farming in chittor district
ఐదంతస్తుల వినూత్న సాగుబడి.. ఏడాది పొడవునా దిగుబడి

By

Published : Oct 25, 2021, 5:19 PM IST

ఐదంతస్తుల సాగుబడి.. ఏడాది పొడవునా దిగుబడి

వర్షాభావ పరిస్థితులు.. ఏటా పలకరించే కరవు.. ఎంత కష్టపడినా.. సాగు చేసిన పంట చేతికి వస్తుందో లేదోనన్న భయం. వీటన్నిటి మధ్య నష్టాల్లో నలిగిపోతున్న చిత్తూరు జిల్లా రైతులు.. సరికొత్త వ్యవసాయం వైపు దృష్టి సారించారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు సాగు చేసి లాభాలు గడిస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు సాగు చేయడంతో పాటు.. ఏడాది పొడవునా ఆదాయం సమకూరే ఐదంతస్తుల వ్యవసాయం వైపు(five steps farming) మొగ్గుచూపుతున్నారు.

అతి తక్కువ విస్తీర్ణంలో 30 రకాల పంటలు సాగుచేస్తున్నారు. రైతు ఆసక్తికి అనుగుణంగా ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులను అనుసరించి, పలు రకాలు పంటలు సాగుచేస్తున్నారు. మొదటి అంతస్థుగా మామిడి, దానిమ్మ, అల్లనేరేడు, బత్తాయి వంటి పండ్ల రకాలు.. రెండో అంతస్థులో బొప్పాయి, నిమ్మ, జామ రకాలు.. మూడో అంతస్థులో టమోటా, బెండ, వంగ, మిరప వంటి కూరగాయలు.. నాలుగో అంతస్థులో పాలకూర, కొత్తిమీర, గోంగూర, చుక్కకూర వంటి ఆకు కూరల రకాలు.. ఐదో అంతస్థులో ముల్లంగి, ఉల్లి, క్యారెట్‌, బీట్‌రూట్‌ వంటి దుంపకూరలు సాగు చేస్తున్నారు. ఈ విధానం మంచి లాభాలు తెచ్చిపెడుతుందంటున్నారు చిత్తూరు జిల్లా రైతులు.

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పదుల సంఖ్యలో రైతులు ఐదంతస్థుల వ్యవసాయంతో లాభాలు గడిస్తుండగా.. మరింత మంది రైతులు ఐదంతస్థుల వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ఐదంతస్తుల వ్యవసాయం ద్వారా అధిక లాభాలు రావడంతో పాటు రైతులు మక్కువ చూపుతున్నందున.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ సాగును పోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీడు భూములను పంట పొలాలుగా మార్చడానికి పెట్టుబడి సాయం చేస్తోంది. మొదటి అంతస్తుగా సాగుచేసే పండ్ల మొక్కల కొనుగోలు, గుంతల తవ్వకం, వాటి నిర్వహణ ఖర్చులకు నరేగా నిధులను కేటాయిస్తున్నారు.

ఇదీ చదవండి:

sand arrears: సర్కార్​ను వీడని ఇసుక కష్టాలు.. రూ.150 కోట్లు బాకీ పడ్డ జేపీ సంస్థ!

ABOUT THE AUTHOR

...view details