వ్యాపారుల వలన చిత్తూరు జిల్లా కరోనా కేసులు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో బి.కొత్తకోటకు చెందిన వస్త్ర దుకాణాల వ్యాపారి హైదరాబాద్‌కు వెళ్లి రావడం వల్ల అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్దరణ అయ్యింది. అతనితోపాటు కుటుంబంలోని ఇద్దరు సభ్యులకు, పని మనిషికి కరోనా పాజిటివ్ వచ్చింది. మరో వ్యాపారి బెంగళూరుకు వెళ్లి రావడం వల్ల అతనికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో నగరంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య ఐదుకు పెరిగింది. కరోనా మహమ్మారి ప్రమాదకారి అని తెలిసి కూడా వ్యాపారులు డబ్బు కోసం చేస్తున్న ప్రయత్నాలు ప్రజలందరికీ కరోనాను చేరువ చేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వ్యాపారులతో విస్తరిస్తున్న కరోనా.. కారణం అదేనా...?
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఇచ్చిన లాక్డౌన్ సడలింపులతో కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న వ్యాపారులు తరచు బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు వెళ్లి వస్తున్నారు. దీంతో వీరి ద్వారా కరోనా విజృంభిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వ్యాపారులతో విస్తరిస్తోన్న కరోనా