పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థపు జలాలు ప్రవాహంలో కలవటంతో చేపపిల్లలు మరణించాయి. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం లోని చెన్నం పల్లె సమీపంలో ఈ ఘటన జరిగింది. రేణిగుంట మండలంలోని గాజుల మండ్యంలో ఉన్న పరిశ్రమ నుంచి ... విచ్చల విడిగా వ్యర్థజలాని స్వర్ణముఖి నదిలోకి విడుదల చేశారు.
చెన్నం పల్లె సమీపము లోని నక్కల వంక లో చేపపిల్లలు మృతి చెంది కుప్పలుగా ఒడ్డుకు చేరాయి. మరోవైపు కాలుష్యనీటితో రోగాలు వ్యాప్తి చెందుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.