ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మేయర్ పక్కన వైకాపా నేత... కార్పొరేటర్ల అభ్యంతరం - tirupati updates

తిరుపతి నగరపాలక కార్యాలయంలో తొలి సమావేశం.. వివాదాస్పదమైంది. అసలు సభ్యుడే కాని ఓ వ్యక్తి.. ఏకంగా మేయర్ పక్కన కూర్చోవడమే.. వివాదానికి కారణమైంది.

first meeting in tirupati municipal office
తిరుపతి నగరపాలక కార్యాలయంలో తొలి సమావేశం

By

Published : Mar 28, 2021, 6:59 AM IST

తిరుపతి స్థానిక నగరపాలక కార్యాలయంలో మేయర్ ఆముద అధ్యక్షతన శనివారం సాయంత్రం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశ మందిరంలోని వేదికపై మేయర్​తో పాటు ఎమ్మెల్యే శ్రీనివాసులు, కమిషనర్ విశ్వనాథ్ కూర్చుకున్నారు.

సమావేశం ప్రారంభంలో వేదికపై మేయర్ పక్కన వైకాపా నాయకుడు లోకేష్ రెడ్డి కూర్చోవటం వివాదాస్పదమైంది. తొలి కౌన్సిల్ సమావేశంలో సభ్యులు కాని వ్యక్తి ఏకంగా మేయర్ పక్కన కూర్చోవడం ఏంటని నగరపాలక కమిషనర్ విశ్వనాథ్​ను కొందరు కార్పొరేటర్లు ప్రశ్నించారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details