చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలంలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. కరోనా మహమ్మారి మన దేశంలో ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు మండలంలో ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాలేదు. తాజాగా జోగువాణి బురుజుకి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్థరణ అయినట్లు మండల వైద్యాధికారి వెల్లడించారు. బాధిత వ్యక్తి గుల్బర్గా నుంచి భార్యను స్వగ్రామానికి తీసుకువచ్చారనీ.. ...అనంతపూర్ రైల్వే స్టేషన్లో అతడికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కొవిడ్ సోకినట్లు తెలిపారు. బాధితుడిని మదనపల్లె ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. జోగువాణి బురుజు అధికారులు అప్రమత్తమై... బాధితుడు ఉన్న ప్రాంతంలో శానిటైజేషన్ పనులు చేపట్టారు.
తంబళ్లపల్లె మండలంలో మెుదటి కరోనా పాజిటివ్ కేసు - తంబళ్లపల్లె కరోనా వార్తలు
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో మెుదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు. గుల్బర్గా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు.
తంబళ్లపల్లె మండలంలో మెుదటి కరోనా పాజిటివ్ కేసు