ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలో అగ్నిప్రమాదం... ఒకరు సజీవదహనం - తిరుమల తాజా సమాచారం

తిరుమలలోని ఆస్థాన మండపం వద్దనున్న దుకాణాల్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 దుకాణాలు దగ్ధం కాగా.. ఒకరు సజీవదహనమయ్యారు.

fire-accident-in-tirumala
fire-accident-in-tirumala

By

Published : May 4, 2021, 7:54 AM IST

Updated : May 4, 2021, 12:28 PM IST

తిరుమలలో ఆస్థానమండపంలోని దుకాణ సముదాయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఉదయం ఆరున్నర గంటల సమయంలో శ్రీవారి చిత్ర పటాలు విక్రయించే దుకాణంలో మంటలు చెలరేగాయి. కొద్ది సమయంలోనే వేగంగా మంటలు ఇతర షాపులకు వ్యాపించారు.. ఈ ఘటనలో 20 దుకాణాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. శకలాలు తొలగిస్తుండగా షాపు నెం.84లో ఓ మృతదేహం లభ్యమైంది. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రూ.30 లక్షలకు పైగా నష్టం వాటిలిందని అగ్నిమాపక, తితిదే విజిలెన్స్ అధికారులు అంచనా వేశారు. ఆగ్నిప్రమాదంతో తాము నిండా మునిగి పోయామని బాధితులు వాపోయారు.

తిరుమలలో అగ్నిప్రమాదం
Last Updated : May 4, 2021, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details