చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని కొటాల, పులిత్తివారిపల్లిలో ఉన్న కొండలకు ఆకతాయిలు నిప్పు పెట్టారు. నిన్న రాత్రి మంటలు చెలరేగగా.. ఈరోజు మధ్యాహ్నం కొండ ప్రాంతానికి వ్యాపించాయి. పచ్చని చెట్లు, అటవీ జంతువులు, పక్షులు అగ్నిలో చిక్కుకున్నాయి. ఈ విషయంపై అటవీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు స్పందించటం లేదని స్థానికులు వాపోతున్నారు. మంటలు సమీప గ్రామాలను చేరక మునుపే అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని.. గ్రామస్థులు కోరుతున్నారు.
శేషాచలం అడవుల్లో మంటలు.. పట్టించుకోని అధికారులు
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని శేషాచల అడవుల్లో మూగజీవాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రాంతంలో నిప్పు పెట్టారు. మంటల వ్యాప్తి కొనసాగుతున్నా.. అధికారుల పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
శేషాచలం అడవులకు నిప్పు పెట్టిన దుండగులు..