చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం పుంగనూరు రహదారిలోని కారు మెకానిక్ షెడ్డులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నాలుగు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో మరమ్మతుల కోసం షెడ్‌కు తీసుకొచ్చిన కార్లు దగ్ధమైనట్లు దుకాణ యజమానులు తెలిపారు.
మెకానిక్ షెడ్లో అగ్ని ప్రమాదం.. నాలుగు కార్లు దగ్ధం - fire accident in car repair shed latest news
చిత్తూరు జిల్లా మదనపల్లెలో పుంగనూరు రహదారిలోని మెకానిక్ షెడ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నాలుగు కార్లు కాలిపోయినట్లు దుకాణ యజమానులు తెలిపారు.
మెకానిక్ షెడ్లో అగ్ని ప్రమాదం
అగ్నిప్రమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేయటంతో భారీ ప్రమాదం తప్పిందని వారన్నారు. షెడ్ సమీపంలోనే పెట్రోల్ పంపు ఉందని.. అక్కడివరకు మంటలు విస్తరించకుండా నిరోధించిగలిగినట్లు చెప్పారు. విద్యుదాఘాతంతో ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు.