ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శేషాచలం అడవుల్లో చెలరేగిన మంటలు - శేషాచలం అటవీలో ఫైర్​లైన్స్​

Fire Accident at Seshachalam: శేషాచలం అడవుల్లోని కాకులకోన ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

fire accident at seshachalam forest
శేషాచలం అటవీప్రాంతంలో అగ్నిప్రమాదం

By

Published : Feb 25, 2022, 7:01 PM IST

చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లోని కాకులకోన ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదాల నివారణలో భాగంగా.. అటవీ సిబ్బంది ఫైర్​లైన్స్ ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో భారీగా వీచిన గాలులకు.. అగ్నికీలలు అటవీప్రాతంలో వ్యాపించాయి. ఈ క్రమంలో కార్చిచ్చు చెలరేగడంతో పరిస్థితి అదుపుతప్పింది. దీంతో.. ఆ ప్రాంతం మొత్తం మంటలు ఎగిసిపడుతూ.. దట్టమైన పొగ అలుముకుంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు అగ్నిమాపక వాహనాలు, ట్యాంకర్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే పవన విద్యుత్ కేంద్రం ఉండడంతో.. మంటలు ఆ వైపునకు మంటలు వ్యాప్తిచెందకుండా చర్యలు చేపట్టారు. భారీగా గాలులు వీస్తుండడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details