చిత్తూరు జిల్లా మదనపల్లెలోని బరోడా బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగింది. కదిరి రోడ్డులోని బరోడా బ్యాంకు లోపలి నుంచి పొగలు వస్తుండటంతో... స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. బ్యాంకు వద్దకు చేరుకున్న సిబ్బంది.... బ్యాంకు తలుపులు తెరిచి మంటలను అదుపు చేశారు.
మదనపల్లె బరోడా బ్యాంకులో అగ్ని ప్రమాదం - మదనపల్లెలో అగ్ని ప్రమాదం
చిత్తూరు జిల్లా మదనపల్లె బరోడా బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
![మదనపల్లె బరోడా బ్యాంకులో అగ్ని ప్రమాదం Fire accident at Madanapalle Baroda Bank](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7267966-1099-7267966-1589911026898.jpg)
మదనపల్లె బరోడా బ్యాంకులో అగ్ని ప్రమాదం
అగ్ని ప్రమాదం కారణంగా... బ్యాంకులో పలు ఫైళ్లు, దస్త్రాలు దగ్ధమయ్యాయి. ఫర్నిచర్ కాలిపోయింది. గదులన్నీ మసిబారి పోయి పొగతో నిండిపోయాయి. విద్యుదాఘాతం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.. ఆస్తి నష్టం ఎంత జరిగి ఉంటుందని దానిపై... దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.