ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాల ఉత్పత్తి పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం! - chittoor latest news

చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని నిర్వాహకులు తెలిపారు.

అగ్ని ప్రమాదం
అగ్ని ప్రమాదం

By

Published : Jul 29, 2021, 1:41 PM IST

Updated : Jul 29, 2021, 3:42 PM IST

పాల ఉత్పత్తి పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం!

చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారి పక్కన పారిశ్రామిక వాడ సమీపంలోని డైనమిక్స్ పాల ఉత్పత్తి పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.

సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమించారు. ఘటనలో.. సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. భారీ నష్టం వాటిల్లిందని నిర్వాహకులు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు.

Last Updated : Jul 29, 2021, 3:42 PM IST

ABOUT THE AUTHOR

...view details