ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంక్రాంతి సంబరాల్లో.. సినీ నటుడు మోహన్ బాబు కుటుంబం - చిత్తూరు శ్రీ విద్యానికేతన్ లో సినీ నటుడు మోహన్ బాబు కుటుంబం సంక్రాంతి సంబరాలు

సినీ నటుడు, శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల యజమాని మోహన్ బాబు కుటుంబం సంక్రాంతి సంబరాలు చేసుకుంది. ఏటా పండుగ రోజు తన విద్యా సంస్థల్లో జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తున్నట్టు మోహన్ బాబు చెప్పారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తూ... వేడుకను జరుపుకోవాలని కోరారు.

actor mohanbabu
సంక్రాంతి సంబరాల్లో సినీ నటుడు మోహన్ బాబు కుటుంబం

By

Published : Jan 13, 2021, 10:28 AM IST

సంక్రాంతి సంబరాల్లో సినీ నటుడు మోహన్ బాబు కుటుంబం

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఏ.రంగంపేట వద్ద శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ముందు... సినీ నటుడు, విద్యా సంస్థల యజమాని మంచు మోహన్ బాబు కుటుంబం సంక్రాంతి సంబరాలతో సందడి చేసింది. ఏటా పండుగ రోజున కుటుంబ సభ్యులంతా కలిసి శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల్లో జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ క్రమంలో కళాశాల ఎదుట భోగి మంటలు వేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని.. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ.. వేడుకలు జరుపుకోవాలని మోహన్ బాబు కోరారు. కళాశాల విద్యార్థినీ విద్యార్థులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం కుటుంబ సభ్యులు అందరూ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details