వాలంటీర్‌గా పనిచేస్తున్న యువతి అదృశ్య ఘటనపై వైకాపా ఎస్సీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి సహా ఎనిమిది మందిపై చిత్తూరు జిల్లా పెద్దపంజాణి పోలీసులు శనివారం కేసునమోదు చేశారు. వీరపల్లె పంచాయతీ తొమ్మిదో క్లస్టర్ వాలంటీర్‌గా పనిచేస్తున్న ఓ యువతి గురువారం విధులకు హాజరైంది. రెండు రోజులైన తిరిగి రాలేదు. ఇటీవల తమ కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తించిన వైకాపా ఎస్సీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు సెల్‌ఫోన్ స్వీచ్ ఆఫ్ లో ఉండటం, తన కుమార్తె ఫోన్ సైతం పనిచేయకపోవడంతో అతనితో పాటు అతని భార్య శ్రీదేవి, ఆరుగురు అనుచరులపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై కిడ్నాప్ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. గతంలో ఇదే వాలంటీర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించి వేధించిన కేసులో శ్రీనివాసులు అరెస్టయి ఇటీవల బెయిల్ పై వచ్చాడు.
మహిళ వాలంటీర్ అదృశ్యం...8 మందిపై కేసు నమోదు
వాలంటీర్‌గా పనిచేస్తున్న యువతి అదృశ్యమైన ఘటన పై వైకాపా ఎస్సీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి సహా ఎనిమిది మందిపై చిత్తూరు జిల్లా పెద్దపంజాణి పోలీసులు శనివారం కేసునమోదు చేశారు.
మహిళ వాలంటీర్ అదృశ్యం...8 మందిపై కేసు నమోదు