చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల రైతులు, కూలీలు ఓ వైపు కరోనా భయం ఎదుర్కొంటూనే మరో వైపు ఖరీఫ్ సేద్యానికి సన్నద్ధం అయ్యారు. ఇప్పటికే లాక్డౌన్తో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన రైతులు ఆ భారం నుంచి బయట పడేందుకు ఖరీఫ్ పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలోని పడమటి మండలాల్లో గత రెండు మూడు రోజులుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
ఈ వర్షాలు ఖరీఫ్ సాగుకు అనుకూలంగా మారాయి. పొలాలను దుక్కులు చేసే పనులు, విత్తనాలు సమకూర్చే పనుల్లో రైతాంగం ఉంది. ప్రస్తుతం ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధరలతో విత్తనాలు కొనుగోలు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి రాయితీ విత్తనాలతో పాటు ఎరువులు, ఇతర వ్యవసాయ పనిముట్లు రాయితీపై అందించాలని కోరుతున్నారు.