చిత్తూరుజిల్లా కల్లూరు మండలంలోని వెంకటదాసరిపల్లె పంచాయతీ పరిధిలోని ఓ బావిలో పడిన ఆవును రైతులు కాపాడారు. ఓ ఆవు సువ్వారపువారి పల్లె గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో మేతమేస్తూ... పొరపాటున సమీపంలోని 30 అడుగుల లోతులో ఉన్న వ్యవసాయ బావిలో పడి పోయింది. గమనించిన స్థానికులు బావిలోకి దిగి తాళ్ల సాయంతో ఆవును ప్రాణాలతో బయటకు తీశారు.
30 అడుగుల లోతు బావిలో పడిన ఆవు... రక్షించిన స్థానికులు - తిరుపతి వార్తలు
మేతకు వెళ్లిన అవు పొరపాటున 30 అడుగుల లోతున్న బావిలో పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. గ్రామస్థులు తాళ్ల సాయంతో ఆవును బయటకు తీశారు.
బావిలో పడిన ఆవుని కాపాడుతున్న స్థానికులు