మామిడికి గిట్టు బాటు ధర కల్పించే విషయమై ప్రజా ప్రతినిధులను కలవడానికి యత్నించిన రైతు సంఘం నాయకుల్ని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి అధికారులతో ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంలో అక్కడికి చేరుకున్న రైతు సంఘం నాయకులు తమను లోపలికి అనుమతిస్తే మంత్రులను కలసి మామిడి గిట్టు బాటు ధరలపై వినతి పత్రం అందజేస్తామని కోరారు. దానికి పోలీసులు అనుమతించ లేదు. దీంతో జడ్పీ భవనం ఎదుట రైతు సంఘం నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. సమావేశం జరగుతుండటంతో వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి: