ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'స్వీయ నియంత్రణ పాటిస్తాం... కరోనాను తరిమికొడతాం' - corona effect in chittor

అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఇంటి పట్టునే ఉంటూ కరోనాపై పోరాటం చేయాలన్న ప్రభుత్వ ప్రకటనలు పట్టణ వాసులకు చెవికెక్కలేదు. నిత్యావసర సరకుల కొనుగోలు కోసం కల్పించిన కొద్దిపాటి సమయంలోనే రోడ్లపైకి వచ్చి కరోనా వైరస్‌ వ్యాప్తికి తమ వంతు సహకారం అందించారు. పోలీసులు లాఠీ పట్టుకున్నా లాక్‌డౌన్‌ నిబంధనలు లెక్కచేయక రహదారులపైకి వచ్చి కేసుల్లో ఇరుక్కున్నారు. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

స్వీయనియంత్రణ పాటిస్తాం... కరోనాను తరిమికొడతాం
స్వీయనియంత్రణ పాటిస్తాం... కరోనాను తరిమికొడతాం

By

Published : May 24, 2020, 5:39 PM IST

స్వీయనియంత్రణ పాటిస్తాం... కరోనాను తరిమికొడతాం

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహామ్మారిపై యుద్దం చేయలాంటే ప్రతి ఒక్కరు ఇంటిపట్టున ఉండాల్సిందే. ప్రభుత్వాలు సైతం వైరస్​పై తగిన జాగ్రత్తలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా పట్టణ వాసులకు అదేదీ చెవిన పడలేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

కరోనా వైరస్‌పై పూర్తి అవగాహనతో స్వీయ నియంత్రణ పాటించారు. వ్యవసాయ పనులకు సైతం వేరే గ్రామ ప్రజలను తమ గ్రామంలోకి రానివ్వకుండా ఆంక్షలు విధించారు. ఊరందరూ ఏకమై ఒక్కో రోజు ఒకరి పొలంలో పనులు చేస్తూ కూలీల కొరత లేకుండా చూసుకొన్నారు. భౌతిక దూరంతో నిబంధనలు అనుసరిస్తూ కరోనాపై యుద్దం చేస్తున్నారు. ఈ విషయంపై.. తిరుపతి నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు.

ABOUT THE AUTHOR

...view details