Farmers concern at Vedurukuppam mro office : భూకబ్జాదారులకు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారంటూ... చిత్తూరు జిల్లా వెదురుకుప్పుం తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం... చేష్టలుడిగి చూస్తోందని ఆరోపించారు. అక్రమార్కులకు రెవెన్యూ అధికారులు అండగా నిలవడం దారుణమని వాపోయారు. ఆందోళన చేపట్టిన రైతులతో తహసీల్దార్ మాట్లాడుతుండగా... పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. రెవెన్యూ అధికారులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వావాదం జరిగింది. ఇదే క్రమంలో తాసిల్దార్ పార్వతి మాట్లాడుతూ గతంలో జరిగిన పొరపాట్లకు తనకు సంబంధం లేదని, రైతుల సమస్యను జిల్లా అధికారులకు తెలియజేసి పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. రైతుల ధర్నాకు నియోజకవర్గ జనసేన బాధ్యులు యుగంధర్ తమ పార్టీ నేతలతో మద్దతు తెలిపారు.
Farmers concern : భూకబ్జాదారులకు.. రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారంటూ రైతుల అందోళన - చిత్తూరు జిల్లాలో రైతుల ఆందోళన వార్తలు
Farmers concern at Vedurukuppam mro office : చిత్తూరు జిల్లా వెదురుకుప్పుం తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. భూకబ్జాదారులకు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారంటూ ఆరోపించారు.అక్రమార్కులకు రెవెన్యూ అధికారులు అండగా నిలవడం దారుణమని వాపోయారు
Farmers concern