ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివాదాస్పదమైన భూసేకరణ.. అత్మహత్యకు యత్నించిన సాగుదారులు - Farmers attempted suicide at chittoor news update

ప్రభుత్వ ఇంటి స్థలాల పంపిణీ కోసం స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని చల్లారపల్లె గ్రామానికి వెళ్లగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సాగుదారులు తహసీల్దార్​ ఎదుట ఆత్మాహత్యకు యత్నించడం ఆందోళన రెకెత్తించింది. దీంతో అధికారులు చేసేది లేక వెనుదిరిగారు.

Farmers attempted suicide on mro
తహసీల్ధార్​ ఎదుట అత్మహత్యాయత్నం చేసిన సాగుదారులు

By

Published : Jul 6, 2020, 10:18 PM IST

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పరిధిలోని బైరెడ్డిపల్లె మండలం పెద్ద చల్లారపల్లె గ్రామంలో ఇంటి స్థలాల సేకరణ వివాదాస్పదం అయింది. ఖాళీగా ఉన్న ఎకరాలో కొంత మంది సాగు చేసుకుంటున్నారు. పేదలకు ఇంటి స్థలాల పంపిణీ కోసం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు వెళ్లారు. కానీ తహసీల్దార్ ఎదుట సాగుదారులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెనుతిరిగారు.

ABOUT THE AUTHOR

...view details