చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం గొల్లపల్లికి చెందిన రైతు బయన్న.. వ్యవసాయం కోసం రూ.10లక్షలు అప్పు చేశాడు. పంట దిగుబడి సరిగ్గా రాక, చేసిన అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనోవేదనకు గురై జూన్ 27 నుంచి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారిస్తుండగా గొల్లపల్లి సమీపంలోని కనుకొండ అడవిలో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు.
అప్పుల బాధ తాళలేక ఉరి వేసుకుని రైతు ఆత్మహత్య - chithore district news updates
చిత్తూరు జిల్లా గొల్లపల్లిలో విషాదం జరిగింది. అప్పుల బాధ తాళలేక ఓ రైతు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మృతుని కుటుంబంలో విషాదం నింపింది.
అప్పుల బాధ తాళలేక ఉరి వేసుకుని రైతు ఆత్మహత్య